దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 18,500లకు చేరాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 446కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో 196కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.
రాజస్థాన్ లో 98,యూపీలో 84,ఏపీలో 75,ఢిల్లీలో 78కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1235కేసులు నమోదైతే మరణాల సంఖ్య 592కి చేరుకుంది.నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా మొత్తం 33మంది మరణించారు.