అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు చేయించారు.
దాంట్లో ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.