రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు.
ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ సంతోశ్‌కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్పూర్తిదాయకంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక ఐకానిక్ ప్రోగ్రాంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోశ్‌కు పూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తానూ కూడా సైబరాబాద్ సీపీ సజ్జనార్, డా.ధీరజ్, డీసీపీ సందీప్, ప్రముఖ సినీనటి ప్రియమణి, డైరక్టర్ రవిబాబులను గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నట్లు పేర్కొన్నారు.