తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,102 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖహెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
అలాగే 1,903 మంది కరోనా నుండి కోలుకున్నారు. 9మంది కరోనా వల్ల మృతి చెందినట్లు బులిటెన్లో వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,120 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వివరించింది.
దీంతో మొత్తం 91,361 కు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. అందులో మొత్తం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 68,126 మంది కరోనా నుండి కోలుకున్నారు