Home / HYDERBAAD / మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్‌

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్‌

హైదరాబాద్‌ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు.  ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు.  ఇటీవల అమెజాన్‌ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ను మనం మంచిగ తయారుచేసుకొన్నం.

శాంతిభద్రతలు లేకపోతే పెట్టుబడి పెట్టేవారు రారు. అభివృద్ధి ఆగిపోతుంది. నగరంలో ఓట్లకోసం వెళ్లినపుడు ప్రజలకు ఇవన్నీ విడమరిచి చెప్పాలి. అగ్గిమండే సమాజం కావాలా? అభివృద్ధి కోరుకొనే సమాజం కావాలా అన్నది ప్రశ్నించాలి.

తెలంగాణ వచ్చాక మనంచేసిన అద్భుత అభివృద్ధిని వివరించాలి. దేశంముందు మనం నగుబాటు కావొద్దు. హైదరాబాద్‌వాసులంటే గర్వంగా ఉండే పరిస్థితి కొనసాగాలి. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి అని తెలంగాణ భవన్ లో జరిగిన  టీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు..