Home / MOVIES / బండ్ల గణేష్ విన్నపం.. మరి వింటరా..?

బండ్ల గణేష్ విన్నపం.. మరి వింటరా..?

‌మెడీయ‌న్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన బండ్ల గ‌ణేష్ బ‌డా నిర్మాత‌గా మారాడు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన ఆయ‌న మ‌ధ్య‌లో  కాస్త బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్ళాడు.

అక్క‌డ కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చాడు. త్వ‌ర‌లో పవ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు.

అయితే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌ని కొంద‌రు నెటిజ‌న్స్ రాజ‌కీయాల‌లోకి లాగి రచ్చ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై ఆవేద‌న చెందిన బండ్ల త‌న ట్విట్ట‌ర్‌లో కామెంట్ పెట్టాడు.

“నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్” అంటూ వారందరినీ రిక్వెస్ట్ చేశారు.