Home / SLIDER / 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో జయప్రకాష్ నగర్ కాలనీ నందు 108 డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గారి గెలుపును ఆకాంక్షింస్తూ అన్వర్ షరీఫ్ గారి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ అరెండ్లలో మన హైదరాబాద్ లో 68 వేల కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు .

24 గంటలు కరెంట్ తో పాటు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని , శాంతి భద్రతల విషయంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ నగరం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుందన్నారు . కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు , ప్రాజెక్టులు విషయం గూరించి పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించటంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన వాటితో పాటుగా విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నేటి వరకు నేరవేర్చలేదన్నారు . సియం కేసిఆర్ గారు, కేటీఆర్ గార్ల ఆశీర్వాదంతో 108 డివిజన్ లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీకాంత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు .

హైదరాబాద్ లో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కసి , పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు . తెలంగాణ సాధనలో మన నాయకుడు కేసిఆర్ గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ ఎన్నికల్లో ముందుకుపోవాలన్నారు . ఈ ఎన్నికలలో అందరం కలిసి , కష్ట పడి పని చేద్దామని , మీకు అండగా నేను ఉంటానని అలానే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని నామ స్పష్టం చేశారు . ఇంకా అభివృద్ధి జరగటానికి రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ఆఖండ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు .

ఈ సందర్భంగా కాంగ్రెస్ , టిడిపి కు చెందిన పలువురు నాయకులు ఎంపి నామ గారు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు మరియు తెరాస పార్టీ జనరల్ సెకట్రరీ బండి రమేష్ గార్ల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు . మక్త మహబూబ్ పేట నుండి గుండె దయానంద్ , కాసాని శ్రీధర్ నాయకత్వంలో టిడిపికు చెందిన కె.ప్రభాకర్ , పి.నర్సింగరావు , సిహెచ్ రాజు , కాంగ్రెస్ కు చెందిన టి.నర్సింహాగౌడ్ , శుభాష్ చంద్రబోస్ , ఎం . అల్లబోయిన సంతోష్ తదితరులను పార్టీ కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో 108 వ డివిజన్ చెందిన పురుషోత్తం , మోహన్ , బి.ఎస్.ఎస్ కిరణ్ , గంగాధర్ , ప్రతాప్ రెడ్డి , మహీందర్ , అన్వర్ షరీఫ్ , గోపాల్ , శ్రీనివాస్ , చంద్రక ప్రసాద్ , రోజా , వరలక్ష్మి , ఖాజా , జహంగీర్ లతో పాటుగా పలువురు టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు , శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat