Home / HYDERBAAD / GHMC Results Update-గ్రేటర్ లో తొలి ఫలితం వెల్లడి

GHMC Results Update-గ్రేటర్ లో తొలి ఫలితం వెల్లడి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు.

కాగా.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది