ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశలో కోవిడ్ టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రాజకీయవేత్తలతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండవ రౌండ్లో టీకా తీసుకోవాలన్న సూచన చేశారు.
తొలి దశలో కేవలం ఫ్రంట్లైన్, హెల్త్ వర్కర్లకు మాత్రమే టీకా వేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 7.86 లక్షల హెల్త్ కేర్ వర్కర్లు టీకాలు వేసుకున్నట్లు కేంద్రం తెలిపింది.