Home / ANDHRAPRADESH / షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్

షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు.

బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో బరిలోకిదిగుతున్నట్లు తెలిపారు.

మా తండ్రి వైఎస్ కు పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అని ఆమె అన్నారు.. మీడియాతో మాట్లాడిన షర్మిల ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన కానీతెలంగాణలో తన ప్రభంజనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.తాను చేపట్టబోయే ఈ మహాయజ్ఞానికి తెలంగాణ ప్రజలు తనకు అన్ని విధాలా మద్ధతుగా నిలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.