దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు.
రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.