Home / SLIDER / కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మృతి పట్ల రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మానవతావాది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఎమ్మెస్సార్, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ముక్కుసూటి మనిషిగా సమస్యల పరిష్కారానికి ఎమ్మెస్సార్ చేసిన సేవల్ని స్మరించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, ఈ విషాద సమయంలో దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని గంగుల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.