తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్‌ను ట్విట్టర్ లో పరిచయం చేశారు.
ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. తన మాట నిలబెట్టుకున్నట్లు చెప్పగా.. మంత్రి KTR అభినందించారు.