తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,41,153కు చేరింది.
మొత్తంగా 3,784 మంది కరోనా ధాటికి మరణించారు. కొత్తగా 710 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 6,27,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి.