Breaking News
Home / MOVIES / మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ అంటూ సాగే లిరికల్‌ పాట విడుద‌ల చేయగా,దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇది సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. విశ్వక్ సేన్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్ లా మంచి ఫన్ ని కూడా పుట్టించాడు. నివేతా పెథురాజ్ తో మంచి ఎమోషన్స్ పండించింది. ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈచిత్రంలో ఈనగరానికి ఏమైంది ఫేమ్ సిమ్రాన్ చౌదరి కూడా కనిపిస్తుంది.

దిల్‌ రాజు సమర్పణలో వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, రాధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా విజ‌యం సాధిస్తే విశ్వ‌క్ సేన్ కెరియ‌ర్‌కి చాలా హెల్ప్ అవుతుంద‌ని ఆయ‌న అభిమానులు కూడా భావిస్తున్నారు. మ‌రికొద్ది రోజుల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌ల కానున్న పాగ‌ల్ చిత్రం ఎంత‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino