Home / NATIONAL / దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 76.5 కోట్లు దాటిందని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కొత్తగా 30,570 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇందులో 3,25,60,474 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా, 3,42,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మరో 4,43,928 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 38,303 మంది కరోనా నుంచి బయటపడగా, 431 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో అత్యధికం కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర బుధవారం ఒకేరోజు 17,681 కేసులు నమోదవగా, 208 మంది చనిపోయారని పేర్కొన్నది.