Home / NATIONAL / భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం ఎదురైంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కోల్పోయింది. మండి లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది.

ఆ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌తిభా సింగ్‌.. బీజేపీ అభ్య‌ర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు ప‌ది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియ‌ర్ కుషాల్ ఓట‌మి పాల‌య్యారు. ఇక ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బ‌ల్ అసెంబ్లీ స్థానాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకున్న‌ది. ఫ‌తేపూర్ నుంచి భ‌వానీ సింగ్‌, ఆర్కీ నుంచి సంజ‌య్‌, జుబ్బ‌ల్ నుంచి రోహిత్ ఠాకూర్‌లు గెలుపొందారు.