1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది.
ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.