సర్కారు కొలువుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీకి శాసనసభలో సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొత్త పోస్టుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.