కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ . సంచలన వ్యాఖ్యలకు నిలయం ఆయన. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన భువనగిరి ఎంపీ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు అని కూడా వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి.
తాజాగా ఈ వార్తలపై క్లారిటీచ్చినట్లే మాట్లాడారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వంపై.. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ కొట్లాడకపోతే కోట్లాడే పార్టీలో చేరతాను. కాంగ్రెస్ ను వీడాల్సి వస్తే కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేసే పార్టీలో చేరతాను అని పరోక్షంగా పార్టీ మారతాను అని పార్టీ మార్పుపై చెప్పకనే చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీ మారుతాను అంటూ కొందరూ తప్పుడు కథనాలను ప్రచురించారు. అయితే తాను పార్టీ మారితే తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ప్రజల అభిప్రాయం మేరకు తాను నిర్ణయం తీసుకుంటాను . అంతిమంగా తాను పార్టీ మారాల్సి వస్తే మారతాను ఆయన కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పారు.