కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలోని లహరి గ్రీన్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, జెనరల్ సెక్రెటరీ వి.శ్రీనివాస్, మెంబర్స్ సత్యనారాయణ, సుధాకర్ పాల్గొన్నారు.