Home / NATIONAL / కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష

ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు.

అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన తెలిపిన బీజేవైఎం కి చెందిన కార్యకర్తలపై దాడి జరిగిందని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు పూర్వపరాలను విచారించి దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. దీనిపై మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ఇండోర్ కోర్టు తన గురించి ఇచ్చిన తీర్పు పై రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino