Home / ANDHRAPRADESH / అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా

అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా

టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్‌ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్‌ లెగ్‌ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని రోజా చెప్పారు. సీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యేందుకు  ఒంటిమిట్ట వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడారు.

మహానేతతో కలిసి పనిచేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ మంత్రివర్గంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినపుడు వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలని భగవంతుడిని వేడుకున్నానని.. ఆ కోరిక నెరవేర్చినందుకు కల్యాణోత్సవానికి హాజరయ్యానని తెలిపారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat