ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అన్నా గౌరవం. కానీ నువ్వు దరిద్రానివి. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నావ్. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు’ అంటూ ట్వీట్లు చేశారు.
