దేశంలో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రోజు 2927 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న గడిచిన ఇరవై నాలుగంటల్లో బుధవారం కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,30,68,799కు చేరాయి.
ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి.గత 24 గంటల్లో 39 మంది కరోనాకు బలవగా, 2563 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతానికి పెరిగిందని తెలిపింది. కాగా, మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది.