కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
