Home / SLIDER / పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష

పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష

ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, TSEWIDC చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ నగేష్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. ఈ నెల 3 వ తేదీ నుండి ప్రారంభం కాకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి టీం కు రెండు వాహనాలను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ టీం లు ప్రజలతో కలిసి ఆయా కాలనీలు, బస్తీలలో పర్యటించి పారిశుధ్య నివారణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, హాస్పిటల్స్, స్కూల్స్, బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలు, బస్తీలు, కాలనీలలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

వర్షాకాలం సమీపిస్తున్నందున ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహాన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కొన్ని చోట్ల ప్రజలు రహదారులపై చెత్తను వేస్తున్నారని ఆయా ప్రాంతాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఎంతో కాలంగా ఉన్న వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో SNDP కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో నాలాల్లో పూడిక తొలగించడంతో పాటు అవసరమైన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆక్రమణలను తొలగించడం వంటిని చేపడుతున్నట్లు వివరించారు. విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్ లో కోట్లాది రూపాయల తో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రధాన, అంతర్గత రహదారులు కూడా ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. నూతనంగా అనేక ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎవరు ఊహించని విధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar