కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్, టీఎస్ఎస్ పిడిసీఎల్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ మేరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులలో భాగంగా అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు బదిలీ చేసి, రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ గోవర్ధన్, ట్రాఫిక్ ఏసిపి చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డీసీపీ సాంబయ్య, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డీఈ రఘుపతి రెడ్డి, టీఎస్ఎస్ పిడిసీఎల్ ఏడీఈ సతీష్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భూపాల్, డిఈఈ శిరీష, ఏఈ సంపత్, ఎస్ఓ నరేష్ మరియు డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, నాయకులు జల్ద లక్ష్మీనాథ్, కార్తిక్ గౌడ్, ఓంకార్ రెడ్డి, వర ప్రసాద్, సతీష్ గట్టోజి తదితరులు పాల్గొన్నారు.