మహరాష్ట్రంలో బలపరీక్ష ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే నిన్న రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే సీఎం పదవికి ఉద్ధవ్ తాక్రే రాజీనామా చేయడంతో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్షను రద్దు చేశారు.దీంతో మహా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. అసెంబ్లీ సెక్రటరీ రాజేంద్ర భగవత్ దీనిపై మీడియాకు ఓ ప్రకటన చేశారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం జరగాల్సిన బలపరీక్షను రద్దు చేసినట్లు ఎమ్మెల్యేలకు ఆయన తెలిపారు.
