దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.
దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో 4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు.
1,32,457 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 45 మంది మృతిచెందగా, 15,447 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.కరోనా కేసులు కొద్దిగా తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.68కి పడిపోయిందని పేర్కొన్నది.