దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న రోజువారీ పాజిటివ్ కేసులు తాజాగా 19,673కు చేరాయి. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరాయి. ఇందులో 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు కరోనాతో 5,26,357 మంది మరణించారు. మరో 1,43,676 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 45 మంది మృతిచెందగా, 19,336 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.