Home / POLITICS / దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు.

గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి రూ.5వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్‌ మీటింగ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని.. కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలియజేసేందుకు ఇది ఉత్తమైన మార్గమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తెలంగాణ సీఎం ఎందుకు హాజరు కాలేదనే చర్చ జరగాలని..  దేశానికి ఆ సందేశం వెళ్లాలనే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino