రౌడీ ఫెలో ..స్టార్ హీరో విజయ్ దేవరకొండలో తనకు నిజాయతీ బాగా నచ్చింది.. అది అతని మాటల్లోనే కాకుండా యాక్టింగ్లోనూ ఉంటుందని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నాడు. తమకు అప్పులున్నాయని తెలిసి కూడా ‘లైగర్’ కోసం ఇచ్చిన రూ.2 కోట్లను తిరిగిచ్చేసి అప్పులు తీర్చమన్నాడని చెప్పాడు. అలాంటి హీరోలను తాను చూడలేదని, అన్నింటిలో సపోర్ట్ ఉన్నాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ఛార్మి ఎంతో కష్టపడిందని, అనన్య మంచి నటి అని పూరి అన్నాడు.
