తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
