తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్ నటించారు. మరోహీరోయిన్ నిత్యామీనన్ కీలకపాత్ర పోషించింది.
