గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో లైంగిక దాడి, ఏడుగుర్ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి.
ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి వీహెచ్ పీ కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.