ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు.
అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.