తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో పెను తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.