టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ.
ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో రోహిత్ రెండో టెస్టు ఆడటం దాదాపుగా ఖాయమైంది. కాగా, డిసెంబర్ 22 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.