బోథ్ నియోజకవర్గంలో తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కొత్తూరు గ్రామ ప్రజలు నాయకులు డప్పులతో తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ పథకాలపై మరియు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి అభివృద్ధి పై హోరాహోరిన జోరుగా కప్పర్ల గ్రామానికి చెందిన దత్తు అనే గాయకుడు పాటలు పాడుతూ కొత్తూరు గ్రామాన్ని గులాబీమయం చేశారు.
పార్టీలో చేరుతున్న వివిధ పార్టీల నాయకులకు గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని ఏండ్లు వేరే పార్టీలో పని చేసిన అభివృద్ధి కనిపియ్యలేదని అన్నారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి తెచ్చిన రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులను చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని వారికి మనం అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, పిఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి చంటి, సర్పంచ్ గంగారాం, దేవపూర్ సర్పంచ్ అబ్దుల్లా, సర్పంచ్ రాంబాయి, నాయకులు చర్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, దూస సంతోష్, ప్రకాష్, పల్లవి గార్లతో పాటు తదితరులు నాయకులు పాల్గొన్నారు.