తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన గ్లోబల్ బ్యూటీ ట్రెసర్ 2023 విన్నర్స్ మరియు రన్నర్స్ డైరెక్టర్ సుహాసిని పాడ్యం, రుషీనా 2nd విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి దేవికల మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి mrs ఇండియా విన్నర్, mrs బిందు భరత్ అవార్డు గ్రహిత.
ఈ సందర్భంగా అందరు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. యువత ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ మంతా పచ్చదనం పెంచేలా కృషి చెయ్యాలి అన్నారు.
సంపద అంటే ఆస్తులు ఒక్కటే కాదు అని వృక్ష సంపదను పెంచి భావితరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం లో భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 2023 క్యాలెండర్ ను అందచేశారు.