సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు.
వయో వృద్ధుల సంరక్షణ చట్టం కింద సీనియర్ సిటీజన్స్ కోసం కౌన్సెలింగ్ కేంద్రము,అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహణకు థరూర్ క్యాంపు లో ఖాళీగా ఉన్న ఎస్సారెస్పీ భవనం ను కేటాయింపునకు వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల సీనియర్ సిటీజన్స్ కు భరోసా కల్పించేందుకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పలు కీలక ప్రయోజనాల సవరణలు ప్రభుత్వం చేసిందని వివరించారు.జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ తో కోటి రూపాయలు నిధులతో వృద్ధాశ్రమ నిర్మిస్తున్నామన్నారు.
పెన్షనర్స్ ,సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు,పెన్షనర్స్,జర్నలిస్టుల కు నగదు రహిత వైద్యసేవల కోసం జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరి సానుకూలంగా హామీ పొందడం పట్ల తమ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో జగిత్యాల జిల్లా నెంబర్ వన్ గా నిలిచిందని అందుకు కారకులైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా,జగిత్యాల డివిజన్ ఆర్డీవో మాధురి,కోరుట్ల,మెట్ పల్లి ఆర్డీవో వినోద్ కుమార్ లు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కు వివరిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటీజన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టివిశ్వనాథం, పెన్షనర్స్ సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారి వెలముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,ఆర్గనైసింగ్ కార్యదర్శి కొయ్యడ సత్యనారాయణ,పెన్షనర్స్,సీనియర్ సిటీజన్స్ నాయకులు ఎక్బాల్,భీమయ్య,మానాల కిషన్, రాజేశ్వర్,శివానందం,బుచ్చిరెడ్డి,కమలాకర్,కరుణ,విజయ లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు. ,