తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు.
సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించిన మంత్రి కార్నర్ మీటింగులు పెట్టె బీజేపీ నాయకులు ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూడండి అని సూచించారు.
కేంద్ర మంత్రులు తమ తమ సొంత ఊళ్ళల్లో తెలంగాణ మార్క్ అభివృద్ధి చేసినాక మాట్లాడాలి అని హెద్దేవా చేశారు. బిజెపి పాలిత రాష్టాలలో ఎక్కడైనా రైతు బంధు , రైతు భీమా , 24 గంటల విద్యుత్ వంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మూల మీటింగులల్లో అబద్దాలు చెప్పి బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని వారి కుయుక్తులు చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ముందు సాగవని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.