Home / SLIDER / మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ  సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది.

అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నానని మంత్రి తెలిపారు.అలాగే ప్రీతి ఘటన పై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడిని పోలీసు లు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat