తెలంగాణలో కలలుగన్న ప్రగతి సాధ్యమవుతోందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఆమె త్వరలోనే ఐటీ హబు ప్రారంభిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
ఐటీ హబ్ ఏర్పాటుతో 750 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.