అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మొక్కలు నాటారు మేయర్.
మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తిన తనకు తెలపాలని, తను ఎప్పుడు అందుబాటులో ఉంటానని మేయర్ కార్మికులకు తెలిపారు. మహిళా పారిశుధ్య కార్మికులు పని చేసే చోట వేదింపులకు గురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోవద్దని, అలాంటి ఇబ్బందలను ఎదుర్కొంటే దైర్యంగా తనకు తెలుపాలన్నారు.
వేదింపులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తానని మేయర్ వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్,మరియు జీహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.