Home / SLIDER / ఈడీకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

ఈడీకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలోని ఈడీ విచారణకెళ్ళే ముందు ఓ సంచలన లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు చెందిన పది ముబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఇటు మీడియా అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ముగింపు పలుకుతూ రెండు కవర్లలో పది ముబైల్స్ ను చూపించి మరి షాకిచ్చారు. అయితే ఈడీకి రాసిన లేఖలో ఏముందంటే ..?

ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత…

దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను…

ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ?

దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ?

నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే…

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు…

తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది…

రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat