Home / SLIDER / మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సిపిఎం పార్టీకి చెందిన నేతలు  బీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో హనుమకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నేత సుందర రాంరెడ్డి నేతృత్వంలో వారంతా టిఆర్ఎస్ పార్టీలోకి రాగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక క్రియాశీల కార్యకర్తలు ఉన్న పార్టీగా గుర్తింపు ఉందన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పార్టీ కూడా టిఆర్ఎస్సే అన్నారు. పార్టీ కార్యకర్తలు ఏ కారణం చేత మరణించిన వారికి రెండు లక్షల రూపాయల బీమా సదుపాయం ఉన్న పార్టీ కూడా టిఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు గౌరవం కూడా దక్కుతుందని చెప్పారు. కొత్తగా చేరిన వారిని తగిన రీతిలో గుర్తించి గౌరవించాలని మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తాము రాష్ట్రంలో సీఎం కేసీఆర్, అలాగే నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడమ భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ పిట్టల సత్తయ్య, సిపిఎం నాయకులు కాలువ నాగన్న లతో పాటు, కాడబోయి రాజు, కొత్తూరి జనార్ధన్, కాడబోయిన రాజు, మడ్డి నరసయ్య, పాక వీరస్వామి, పాక అంజయ్య, మహేష్ దండు యాదగిరి, బండి యాదగిరి తదితరులు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri