పౌరాణిక నాటకాలు నటప్రావీణ్యానికి ప్రతీకలు అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ ఆడి టోరియం లో విజయభాను నాట్య కళా మండలి ఆధ్వర్యం లో మహాభారతం లో కీలక ఘట్టం అయిన దమయంతి స్వయం వరం నాటక ప్రదర్శన కు ముఖ్య అతిధి గా హాజరైన మంత్రి నాటకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటకం ఒక సమాహార కళ అన్నారు.ప్రజల్ని ప్రభావితుల్ని చేసే ఒక శక్తివంతమైన సాధనం నాటకం అన్నారు.నాటకం వినోదం తో పాటు విజ్ఞానం అందిస్తుంది అన్నారు.తెలంగాణ సమాజం పై నాటక సాహిత్య ప్రభావం చాలా ఉందన్న మంత్రి, సామాజిక సమస్యలపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు.
చైతన్య వంతమైన సూర్యాపేట కళాకారుల కోసం త్వరలోనే కళాభారతి నిర్మాణానికి శంకస్థాపన చేసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.తెలంగాణ పోరాటంపై కూడా నాటక సాహిత్య ప్రభావం ఎంతో ఉందన్నారు .మధ్యయుగం నాటి నిజాం పరిపాలనా విధానంపై వ్యతిరేక ఉద్యమాలు వచ్చిన సమాజంలో నాటక ప్రక్రియ పాత్ర అనన్య సామాన్యమైంది అన్నారు.చరిత్రలో ప్రతి ఉద్యమం కళల్ని, కళాకారుల్ని తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూనే ఉందన్నారు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనలో, జమీందార్ల పెత్తనంపై వ్యతిరేక పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంపై వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలపై నాటక కళ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చింది అన్నారు..
తెలంగాణ ప్రభుత్వం నాటక రంగానికి పెద్ద పేట వేస్తుందని అన్నారు.. కళలకు నిలయం గా ఉన్న సూర్యాపేట గడ్డ పై రంగస్థల కళాకారులకు ప్రోత్సహం అందించేందుకు పలు సందర్భాల్లో ఇక్కడే నాటక ప్రదర్శనలను ఇప్పించడం జరిగిందని అన్నారు.. సమాజానికి నాటక రంగం తో సేవలందిస్తున్న కళాకారులు అందరికీ ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమం లో ఎంపి బడుగుల, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగానీ వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.