బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం,మధిర, పాలేరు నియోజకవర్గాల స్థాయి ప్రతినిధుల సమావేశాలకు అతిథిగా హాజరయ్యారు.ఖమ్మంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వాన ఏర్పాటైన సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అటుతర్వాత రవిచంద్ర మధిర సమావేశానికి హాజరయ్యారు, జెడ్పీ ఛైర్మన్, నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రాంమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.అనంతరం ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలో ఏర్పాటు చేసిన పాలేరు నియోజకవర్గ ప్రతినిధుల సమావేశానికి ఎంపీ రవిచంద్ర అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నాయకత్వాన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్,వేణు తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశాలకు ఆ యా నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గులాబీ శ్రేణులు ఉత్సాహంగా హాజరయ్యారు.ఈ సమావేశాలలో “జై తెలంగాణ జైజై తెలంగాణ,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేటీఆర్ వర్థిల్లాలి,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”అనే నినాదాలు మిన్నంటాయి.